Sample Text

మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు

కాల రూపుడు.....భైరవుడు !

కాల భైరవుడు అనగానే చాలామంది కుక్క అని తేలిగ్గా అనేస్తారు. కాని ఆయనకు చాలా విసిస్త్థత ఉంది. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు.గ్రహ బలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపసానతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నయి.కాల భైరవుడిని కాశి క్షేత్ర పాలకుడిగా కీర్తించారు.ఏది సాదించాలన్నా ముందుగా అయన అనుమతి తీసుకోవాలని "కాశి క్షేత్ర మహిమ చెబుతుంది.సాక్షాత్తు శివుడే కాల భైరవుడే సంచారించాడని శాస్త్రాలు చెబుతున్నాయి.హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తర్వాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని,అతింద్రమైన శక్తులని అయన ప్రసాదిస్తారు.దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు.కొబ్బరి బెల్లం నైవేద్ద్యం పెడతారు.ఈశ్వరుడు ఆయుషును ప్రసాదిస్తాడు.ఆయనకు పరమ విధీయుడైన కాల భైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.

ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడం ఎలా ?

పరమేశ్వరుడుని ప్రసన్నం చేసుకోవడం చాలా సులువు.పెద్ద పెద్ద మ్రొక్కులు మ్రొక్కుకోనవసరం లేదు.నోరారా శివా అని స్మరిస్తూ చెంబేడు నీరు అయన శిరస్సు ఫైన పోసి,చేతికి అందిన పత్రిని ముఖంఫై వేస్తే చాలు..ఆ పరమ శివుడు ప్రసన్నుడుఅయి పోతాడు. సంతోషంతో ఉప్పొంగిపోయి,కామదేనువుని పెరట్తో కట్టేసి,కల్ప వృక్షాన్ని ఇంటి ముందు పాతేసి వెళతాడట.ఈ విషయాన్ని దుర్జాట్టి తన కాళహస్తిశ్వర మహత్యంలో ప్రస్తావించాడు

మొగలి పువ్వును,ఆవును శివుడు శపించాడా?

పూర్వం బ్రహ్మ విష్ణువులు,తమలో తము "నేను గొప్ప అంటే నేను గొప్ప" అని వాదించుకున్నారు.ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది.అది మరింతగా పెరిగి యుద్దానికి దారితీసింది.ఈ యుద్దానికి లోకాలన్నీ తల్లడిల్లాయి.దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకొన్నాడు.ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది.బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించారు.అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కలికంగా సద్దుమణిగింది.ఆ మహా లింగం మొదలు,తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది.బ్రహ్మ హంసా రూపం దరించి లింగం అగ్ర బాగాన్ని చూడడానికి,విష్ణువు వరాహ రుపమలో అదిని కనుక్కోవడానికి బయలు దేరాడు.బ్రహ్మకు ఎంతకు లింగం అగ్ర భాగం కాని మొదలు కాని కనిపించలేదు.ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం(మొగలి పువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని అపితనకు,బ్రహ్మకు,విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి,సహాయం చేయమని అడిగాడు. ఆవు కనపడితే అదే విధంగా చెప్పి,ఆ లింగం అగ్ర భాగాన్ని చూసినట్లుగా,విష్ణువుతో చెప్పేటప్పుడుఅది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాదేయపడ్డాడు.సాక్షాత్తు సృష్టి కర్తయే తనని బ్రతిమాలేసారికి కాదనలేక సరేనంటాను.రెండు,కిందకు దిగి వచ్చే సారికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు.బ్రహ్మ తాను లింగం అగ్ర భాగాన్ని చూశానని ,కావాలంటే అవును, మొగలి పువ్వును అడగమని చెప్పాడు..నిజమే అంది మొగలి పువ్వు,బ్రహ్మ దేవుడి మాటను కాదనలేక అయన లింగం అగ్ర భాగాన్ని చూసాడని ఆవు తలతో చెబుతుంది కాని,అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది.బ్రహ్మ దేవుడి అసత్య ప్రచారాన్ని చూడ లేక ఈశ్వరుడు ప్రతయ్యక్షమయ్యాడు.బ్రహ్మ చెప్పిన ప్రకారం అబద్దపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుతో భక్తులెవ్వరు తనను పూజించరాదని ,తెల్లవారి లేచి ఆవు ముఖం చూడటం కుడా పాప కారణం అని శపించాడు.ఆవు అభ్యర్దన మేరకు తోకతో నిజం చెప్పింది కాబట్టి వృష్టభాగం పవిత్రమైనది,తోక భాగాన్ని పూజించిన వారికీ పుణ్య ఫలాలు కలుగుతాయని వరమును  అనుగ్రహించాడు.మహేశ్వరుడు.


శివుడు అజ్ఞ లేనిదే చీమైనా కుట్టదా?

ఈ సామెత ఓ నమ్మకం నుంచి పుట్టింది.శివుడు కేవలం లయకారుడు మాత్రమేననేది చాలా మంది నమ్మకం. కాని అది నిజం కాదు. అయన కేవలం నాశనం చేసీ వాడు మాత్రమే కాదు.ఈ సృష్టిలోని సమస్త చరా చార ప్రాణ కోటికి ఆయనే నాధుడు. అయన అజ్ఞా లేనిదే ఏ పని జరగదు.ఈ విషయం నుంచే ఫై మాట పుట్టింది. అదే మెల్లగా సామెతలా మారింది. ఏదైనా గొప్ప పని చేసినప్పుడు అదంతా తమకు తాముగా సాధించామని కొందరు గొప్పలు పోతుంటారు.అలాగే మరి కొందరు ఏదైనా అనుకొనిది జరిగితే ఎలా జరిగిందని విస్తు పోతుంటారు.ఇలాంటి సందర్భంలోలో అంతా దేవుడి వల్లే జరిగింది అని చెప్పడానికి ఈ సామెతను వాడుతారు